: జగన్, విజయ్ మాల్యా, దావూద్ ఇబ్రహీంలు ముగ్గురూ ఒకే జాతివారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్


అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురూ ఒకే జాతికి చెందిన వారని ఏపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. వైఎస్సార్సీపీని వీడిన 13 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలంటున్న జగన్ సవాల్ ను స్వీకరిస్తున్నామని, అయితే, కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లతో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని ఆయన కోరారు. ఆర్థిక నేరస్తుడు జగన్ కు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎలా అపాయింట్ మెంట్ ఇచ్చారో అర్థం కావడం లేదని రాజేంద్రప్రసాద్ అన్నారు.

  • Loading...

More Telugu News