: 2019లో కూడా టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలి: ఎమ్మెల్యే గొట్టిపాటి


2019లో కూడా టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని తాజాగా టీడీపీ తీర్థం తీసుకున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. టీడీపీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తనకు పార్టీలో చేరే అవకాశమిచ్చినందుకు కృతఙ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ప్రతిఒక్కరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని, గ్రామాల అభివృద్ధి జరగాలంటే ఫ్యాక్షన్ రాజకీయాలన్నింటిని వదిలిపెట్టి కలిసికట్టుగా అందరూ ముందుకు వెళ్లాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని, రాబోయే రోజుల్లో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసి, జిల్లాలో ఉన్న అన్ని సీట్లను తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా మనమందరము కలిసి కృషి చేద్దామని గొట్టిపాటి అన్నారు.

  • Loading...

More Telugu News