: 'భజరంగీ భాయిజాన్' దర్శకుడు కబీర్ ఖాన్‌కి కరాచీ విమానాశ్రయంలో చేదు అనుభవం
పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ సమావేశానికి హాజరుకావడానికి వెళ్లిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ (భజరంగీ భాయిజాన్ ఫేం)కి అక్కడి ఎయిర్ పోర్ట్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన 'పాంటమ్' చిత్రం పాకిస్థాన్ లో వివాదాస్పమైన విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాల్లో తమ దేశం గురించి కబీర్ ఖాన్ తప్పుగా ప్రస్తావిస్తున్నారంటూ పలువురు పాకిస్థానీయులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ లో భారత్ నిఘా సంస్థ 'రా' సాగిస్తున్న గూఢచర్యంపై ఎందుకు సినిమా తీయబోరని వారు ప్రశ్నించారు. ఆవేశంతో ఊగిపోయిన ఓ వ్యక్తి కబీర్‌పై బూటు విసిరాడు.