: పాలేరు ఉప బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మలనే!... బీ ఫామ్ ఇచ్చిన కేసీఆర్
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ కీలక నేత, తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగనున్నారు. తుమ్మల అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ గతంలోనే ఖరారు చేశారు. అధికారికంగానూ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో తుమ్మల ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఖమ్మంలో నేటి ఉదయం ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు వచ్చిన సందర్భంగా కేసీఆర్... పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలంటూ తుమ్మలకు బీ ఫామ్ అందజేశారు.