: భారత్ బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల దుమ్ము దులిపేస్తున్న'ది జంగిల్ బుక్'


భారత్ బాక్సాఫీస్ వ‌ద్ద హాలీవుడ్ చిత్రం ‘ది జంగిల్ బుక్‌’ దుమ్ము దులిపేస్తోంది. అద్భుత గ్రాఫిక్స్‌తో తెర‌కెక్కించిన ఈ చిత్రానికి భార‌తాభిమానుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దేశంలో ఏ హాలీవుడ్ చిత్రానికీ రానంత రెస్పాన్స్ ‘ది జంగిల్ బుక్’ ద‌క్కించుకుంది. ఈ చిత్రానికి భార‌త్ నుంచి కాసుల వర్షం కురుస్తోంది. భార‌త మార్కెట్లో ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో గ‌త నెల‌ 8వ తేదీన‌ విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హాలీవుడ్ చిత్రం రాబ‌ట్ట‌లేనంత వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇప్ప‌టికే 148 కోట్ల రూపాయలను వ‌సూలు చేసిన ‘ది జంగిల్ బుక్’ మ‌రిన్ని క‌లెక్ష‌న్లు రాబట్టే దిశ‌గా దూసుకెళుతోంది. ఈ సినిమా హిందీ వర్షన్ కు బాలీవుడ్ నటులు ప్రియాంక చోప్రా, నానా పటేకర్, ఓం పురి, ఇర్ఫాన్, షేఫాలి షా వాయిస్ ఓవర్ అందించిన విష‌యం తెలిసిందే. సాహసం, వినోదం అంశాలతో ఈ సినిమా కథ తెర‌కెక్కింది.

  • Loading...

More Telugu News