: కత్తి పట్టిన నారా లోకేశ్!... తలపాగా చుట్టిన విశాఖ నేతలు


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సాగర నగరం విశాఖలో ఘన స్వాగతం లభించింది. విశాఖ జిల్లాతో పాటు ఆ జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై సమీక్ష చేసేందుకు నేటి ఉదయం విశాఖకు వచ్చిన లోకేశ్ కు ఎయిర్ పోర్టులోనే పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆ తర్వాత భారీ కాన్వాయ్ వెంట రాగా ఆయన నగరంలో పార్టీ కొత్త కార్యాలయం ఏర్పాటు కానున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కిన లోకేశ్ కు విశాఖ నేతలు కత్తిని అందించారు. అంతకుముందే ఆయన తలకు తలపాగా చుట్టిన పార్టీ నేతలు కరతాళ ధ్వనులు చేశారు. తలకు తలపాగా చుట్టుకున్న నారా లోకేశ్...పార్టీ కార్యకర్తలు అందించిన కత్తిని పట్టుకుని గాల్లోకి తిప్పారు. పార్టీ జెండా రంగు పసుపు కలర్ చొక్కా వేసుకుని వచ్చిన లోకేశ్ ఆ తర్వాత పార్టీ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.

  • Loading...

More Telugu News