: అమరులకు నివాళితో ఖమ్మంలో ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ
ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ ప్రారంభమైంది. సభా ప్రాంగణానికి ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్‌కు పార్టీనేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్లీనరీ ప్రాంగణం ప్రతినిధులతో నిండిపోయింది. అమరులకు నివాళితో ప్రారంభమైన ప్లీనరీలో 15 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు కేసీఆర్ అక్కడి ఎన్‌ఎస్‌పీ ప్రాంగణంలో టీఆర్‌ఎస్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్లీనరీకి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తల రాకతో ఖమ్మం గులాబీమయంగా మారింది.