: విశాఖ చేరుకున్న నారా లోకేశ్... పార్టీ నేతలతో సమీక్ష, పార్టీ ఆఫీస్ కు శంకుస్థాపన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొద్దిసేపటి క్రితం సాగర నగరం విశాఖలో ల్యాండయ్యారు. విజయవాడ నుంచి నేటి ఉదయం విమానంలో బయలుదేరిన లోకేశ్ కొద్దిసేపటి క్రితం విశాఖ చేరుకున్నారు. విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీలతో సమీక్ష కోసమే ఆయన విశాఖ వచ్చినట్లు సమాచారం. మరికాసేపట్లో ఆయన జిల్లాలోని పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత నగరంలో కొత్తగా ఏర్పాటు కానున్న పార్టీ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.