: దువ్వాడ సెజ్ ప్రమాదంపై చంద్రబాబు ఆరా!... రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్లు


విశాఖ జిల్లా దువ్వాడ సెజ్ లోని బయో మ్యాక్స్ కంపెనీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో అగ్ని కీలలు ఇంకా అదుపులోకి రాలేదు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో కంపెనీలోని 12 ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయాయి. దీంతో మంటలను అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి సాధ్యం కావడం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు... అక్కడి నుంచే సీఎం నారా చంద్రబాబునాయుడికి సమాచారం చేరవేశారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు... భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిన తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో కార్మికులు ఎవరైనా గాయపడ్డారా? అని ఆరా తీశారు. ఇదిలా ఉండగా... ఆయిల్ ట్యాంకర్లు పేలిన కారణంగా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. నిన్న రాత్రి చెలరేగిన మంటలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రమాద తీవ్రతను నిర్ధారించడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు నావికాదళ హెలికాప్టర్లు రంగంలోకి దిగిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినా... మంటలు అదుపులోకి రావడానికి ఇంకా ఐదు గంటల సమయం పడుతుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News