: మరికొద్దిసేపట్లో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -9 లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం ప్రారంభం కావాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్, పూణే సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ కు వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో మ్యాచ్ ను నిలిపివేశారు. టాస్ గెలిచిన సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అంతలోనే సన్న జల్లులు ప్రారంభం కావడంతో పిచ్ ను కవర్లతో కప్పేశారు. రాత్రి 8.25 గంటలకు వర్షం నిలిచిపోవడంతో అభిమానుల్లో ప్రాణం లేచి వచ్చింది. పిచ్ పై పరిచిన కవర్లను సిబ్బంది తొలగిస్తున్నారు. ఆట మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. తాము పూర్తి మ్యాచ్ ఆడనున్నట్టు ధోనీ ప్రకటించాడు. అయితే, వర్షపు జల్లులతో పిచ్ ఎవరికి అనుకూలంగా మారుతుందోనని అభిమానుల్లో కలవరం మొదలైంది.