: మంచి చేస్తోన్న సల్మాన్ లాంటి వారిని ప్రోత్సహించాలి: సల్మాన్‌కు ఐశ్వర్యారాయ్ సపోర్ట్
రియో ఒలింపిక్స్ 2016కు ఇండియన్ టీమ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కి అర్హత లేదంటూ చెలరేగుతున్న వివాదంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే, ఆయనపై విమర్శలు చేస్తున్న వారూ అదే స్థాయిలో ఉన్నారు. ఈ అంశంపై ‘సల్మాన్ వివాదంలో చిక్కుకోవడంలో కొత్త ఏం ఉంది?’ అంటూ సల్మాన్‌కు ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ చురక అంటించిన సంగతి తెలిసిందే. అయితే మరో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ మాత్రం సల్మాన్‌ఖాన్‌కు సపోర్ట్‌గా నిలుస్తోంది. స్పోర్ట్స్, మ్యూజిక్ వంటి అంశాలపై అంబాసిడర్‌గా ఉంటానంటూ ముందుకొచ్చిన వారిని అభినందించాలని చెప్పింది. అంతేకాదు, మంచి చేస్తోన్న సల్మాన్ లాంటి వారిని ప్రోత్సహించాలని పేర్కొంది.