: చంద్రబాబుకు ఇంత నల్లధనం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించే దమ్ము మనకుందా?: వైఎస్ జగన్
వేరే పార్టీల ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు...రూ.30 కోట్లు ఇచ్చి తన పార్టీలోకి లాక్కుంటున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అంత నల్లధనం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించే దమ్ము మనకుందా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కోట్ల రూపాయలు పోసి ఈవిధంగా ఎమ్మెల్యేలను కొనడాన్ని చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అనే అనుమానం వస్తోందన్నారు. తమ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన మునిగిపోయేదేమీ లేదన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు.