: మాల్యా విదేశీ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించాల్సిందేన‌న్న సుప్రీం.. కోర్టుల‌తో ఆడుకోవ‌ద్ద‌ని వార్నింగ్


భార‌త్‌లో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాల‌కు చెక్కేసిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మ‌రో షాక్ త‌గిలింది. విజయ్ మాల్యాపై సుప్రీం సీరియ‌స్ అయింది. కోర్టులతో ఆడుకోవ‌ద్ద‌ని వార్నింగ్ ఇచ్చింది. విదేశీ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించాల్సిందేన‌ని ఆదేశించింది. మాల్యా తన కుటుంబ స‌భ్యుల ఆస్తుల‌ను కూడా వెల్ల‌డించాల‌ని చెప్పింది. మాల్యాపై ఇండియాలోని పలు కోర్టుల్లో నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయిన సంగతి తెలిసిందే. మ‌రోవైపు మాల్యాకున్న రాజ్య‌స‌భ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాజ్యసభ నైతిక విలువల కమిటీ నిన్న‌ ఏకగ్రీవంగా తీర్మానించింది. మే 3న జరిగే భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పుడు విదేశీ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించాల్సిందేన‌ని సుప్రీం ఆదేశాలు జారీ చేయ‌డంతో మాల్యా మరిన్ని చిక్కుల్లో ప‌డ్డారు.

  • Loading...

More Telugu News