: మా నాన్నను క్వశ్చన్ చేసే అర్హత నాకు లేదు: మంచు విష్ణు


ఏ విషయంలోనైనా సరే, తన తండ్రిని ప్రశ్నించే అర్హత గానీ, స్థాయి గానీ తనకు లేవని ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడు, సినీ హీరో మంచు విష్ణు అన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ మోహన్ బాబు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించగా విష్ణు పైవిధంగా స్పందించారు. తన తండ్రికి రాజకీయాలేమీ కొత్త కాదని, గతంలోనే టీడీపీ తరపున రాజ్యసభ ఎంపీగా చేశారని అన్నారు. అయితే, తన తండ్రి ముక్కుసూటి తనానికి రాజకీయాలు సరిపడవని తాను అనుకుంటున్నానని చెప్పారు. పీస్ ఆఫ్ మైండ్ తో ఉన్న ఆయనకు లేనిపోని చిక్కులు వచ్చి పడతాయేమోననిపిస్తోందన్నారు. అయితే, ఈ విషయాన్ని తన తండ్రితో నేరుగా చెప్పలేనని అన్నారు. ఆయన తమకు జన్మనిచ్చారని, ఒకవేళ ఆయన రాంగ్ స్టెప్పు వేస్తూ ఉన్నా, ఆ విషయాన్ని తన తల్లికి చెప్పగలుగుతాము కానీ, తండ్రికి మాత్రం చెప్పలేమని విష్ణు తన మనసులో మాట బయటపెట్టారు.

  • Loading...

More Telugu News