: కశ్మీరే అత్యంత ప్రధానమైన అంశం... దీనికి పరిష్కారం కనుగొనాలి!: పాక్‌


ఢిల్లీలో 'హార్ట్ ఆఫ్ ఆసియా' స‌మావేశం సంద‌ర్భంగా ఈరోజు ఢిల్లీకి వ‌చ్చిన పాక్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ చౌదరీతో భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల మధ్య చర్చల్లో కశ్మీర్ ప్రధాన అంశమ‌ని పాక్ పేర్కొంది. జమ్ము కాశ్మీర్‌ అంశం సహా అన్ని అంశాలపై చర్చలు జరగాలని కోరుకుంటున్న‌ట్లు పాక్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ చౌదరీ తెలిపారు. అయితే దీనిలో కశ్మీర్‌ అత్యంత ప్రధానమైన అంశమని ఆయ‌న పేర్కొన్నారు. దానికి పరిష్కారం కనుగొనాలని అన్నారు. త‌మ‌ సరిహద్దు దేశాలతో స్నేహ బంధాన్ని కోరుతున్న‌ట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News