: ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారెం శివాజీ నియామకంపై హైకోర్టులో పిటిషన్
ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారెం శివాజీ నియామకంపై అభ్యంతరం వ్యక్తం వేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. కారెం శివాజీ నియామకంలో అనుసరించిన విధానంపై పిటిషనర్ ప్రసాద్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, కారెం శివాజీకి హైకోర్టు నోటీసులు జారీ చేసిది. శివాజీ నియామకం ప్రొసీడింగ్స్ ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.