: ప్రపంచంలోనే ఫస్ట్... వాయు కాలుష్యంలో ఢిల్లీ వరస్ట్!
వాయు కాలుష్యాన్ని వెలువరించే నగరాల్లో ప్రపంచంలోనే మన దేశ రాజధాని ఢిల్లీ ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న 12.6 మిలియన్ల మరణాల్లో రెండొంతుల మంది వాయు కాలుష్యం కారణంగానే చనిపోతున్నారని ఆ నివేదికలో పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, కేన్సర్ వంటి రోగాలతోనే చనిపోతున్నారని డబ్ల్యుహెచ్ఓ నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి వాయుకాలుష్యం కారణంగానే సంభవిస్తోందన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు, 50 ఏళ్లు పైబడిన వారిపైనే వాతావరణ కాలుష్య ప్రభావం అధికంగా ఉంటోందని డబ్ల్యుహెచ్ఓ లెక్కల ద్వారా తెలుస్తోంది. 2014లో డబ్ల్యుహెచ్ఓ గాలి నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన సమాచారం మేరకు 91 దేశాల్లో 1600 నగరాల్లో వాతావరణ, వాయు కాలుష్యాల విషయంలో ప్రపంచంలోనే అత్యంత చెత్త నగరం ఢిల్లీ అని ఒక బహిరంగ చర్చ ద్వారా డబ్ల్యుహెచ్ఓ తేల్చి చెప్పింది.