: తలసాని నుంచి వాణిజ్య శాఖను తీసేసి, కేసీఆర్ మంచి పని చేశారు!: మ‌ర్రి శ‌శిథ‌ర్ రెడ్డి


వ్యాపారులు, అధికారులను తెలంగాణ మంత్రి తలసాని వేధింపులకు గురి చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల శాఖ‌ల్లో మార్పులు చేస్తూ వాణిజ్య పన్నులశాఖ బాధ్యతల నుంచి త‌ల‌సానిని తొల‌గించి పశుసంవర్థకశాఖ, మత్స్య శాఖలను అప్ప‌గించిన సంద‌ర్భంగా ఈరోజు హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడారు. వాణిజ్య పన్నులశాఖ బాధ్యతల నుంచి తలసానిని తొల‌గించి తెలంగాణ స‌ర్కార్ మంచి ప‌నిచేసింద‌ని అన్నారు. వ్యాపారులు, అధికారులను వేధించిన త‌ల‌సానిని వాణిజ్య‌ప‌న్నుల శాఖ నుంచి తొల‌గించినందుకు వ్యాపారుల త‌ర‌ఫున‌ కేసీఆర్‌కు ధ‌న్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News