: బంజారాహిల్స్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ నిర్ణయం
ఈరోజు జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో రూ.18 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలనే అంశంతో పాటు ఇంకా పలు తీర్మానాలు చేసింది. పోటు విభాగం తాత్కాలిక కార్మికుల పదవీకాలం ఏడాదిపాటు పొడిగింపు, సర్వభూపాలం, ముత్యంపు పందిరాల కోసం రూ.3.86 కోట్లు కేటాయింపు, మే 22 నుంచి ‘శుభప్రదం’ పేరిట సనాతన ధర్మంపై విద్యార్థులకు అవగాహనా సదస్సు, పద్మావతి మహిళా యూనివర్శిటీకి కేటాయిస్తున్న నిధులు రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పెంపు, స్విమ్స్ అభివృద్ధికి రూ.4.80 కోట్లు, ఒంటిమిట్టలో భక్తులకు వసతి, కల్యాణవేదిక, ఉద్యానవన అభివృద్ధికి రూ.4.60 కోట్ల కేటాయింపు వంటి వాటిపై టీటీడీ తీర్మానాలను చేసింది.