: ఎన్నికల ప్రచారంలో హాస్యనటుడు మనోబాలాకు చేదు అనుభవం
తమిళ సినీ హాస్యనటుడు మనోబాలాపై ప్రజలు చెప్పులు విసిరారు. తమిళనాడులోని ఆర్కేనగర్‌లో అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయనపై ప్రజలు చెప్పుల వర్షం కురిపించారు. ఆర్కేనగర్ నియోజకవర్గ పరిధిలోని వాషర్‌మెన్‌పేటలో ఆయన ప్రసంగిస్తుండగా ప్రజలు ఈ దాడికి దిగారు. దీంతో అక్కడ కాసేపు అలజడి చెలరేగింది. తనపై చెప్పులు విసిరిన వారిపై మనోబాలా మండిపడ్డారు. ఈయనపై ప్రజల ఆగ్రహానికి కారణం మాత్రం తెలియరాలేదు.