: ఉత్త‌రప్ర‌దేశ్‌లో దారుణం.. కుమారుడిని అదుపులో పెట్టలేదంటూ మ‌హిళ‌పై అమానుషం


మ‌నుషుల‌మ‌న్న సంగ‌తిని మ‌ర‌చిపోయిన‌ట్లు ప్ర‌వ‌ర్తించి ఉత్త‌రప్ర‌దేశ్‌లో పలువురు వ్యక్తులు రెచ్చిపోయారు. 60 ఏళ్ల వృద్ధురాలిపై ఉగ్ర‌వాదుల్లా ప్ర‌వ‌ర్తించారు. పెద్ద‌లు పెళ్లికి ఒప్పుకోక‌పోవ‌డంతో ఓ ప్రేమ జంట తాము నివ‌సిస్తోన్న‌ లకింపూర్‌‌ఖేరి నుంచి పారిపోయింది. త‌మ కూతురు పారిపోవ‌డంతో సదరు యువ‌తి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. త‌మ కూతుర్ని మాయం చేశారంటూ అబ్బాయి ఇంటికి యువ‌తి త‌ల్లిదండ్రులు వెళ్లారు. వ‌య‌సులో ఉన్న కుమారుడిని అదుపులో పెట్టలేదంటూ ఇంట్లో ఉన్న అబ్బాయి తండ్రిని తీవ్రంగా కొట్టారు. అనంత‌రం యువ‌కుడి త‌ల్లిపై అమానుషానికి దిగారు. త‌మ వెంట తెచ్చుకున్న కారాన్ని యువ‌కుడి త‌ల్లిపై చ‌ల్లారు. చెప్పుకోలేని భాగాల్లో కారం చ‌ల్లి రాక్ష‌సుల్లా, ఉగ్ర‌వాదుల్లా ప్ర‌వ‌ర్తించారు. స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేలా ప్ర‌వ‌ర్తించిన వారిపై స్థానిక‌ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఘటనలో ఐదుగురు వ్య‌క్తుల‌పై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News