: హైదరాబాదు చల్లబడినట్టేనా?... నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
ఎండలు మండిపోతున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జడుసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకొస్తే ఇక అంతే సంగతులు. శరీరం నిండా చెమటలు. నెత్తిన మండే సూర్యుడు. నాలుగు అడుగులు వేయలేక ఇబ్బందులు... ఇదీ భానుడి ప్రతాపంతో హైదరాబాదు జంట నగరాల్లోని పరిస్థితి. అయితే మొన్న కురిసిన ఓ మోస్తరు వర్షంతో వాతావరణం కాస్తంత చల్లబడినట్టే చల్లబడి... మళ్లీ వేడెక్కింది. తాజాగా కొద్దిసేపటి క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, చార్మినార్, నాంపల్లి, మైలార్ దేవ్ పల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో కురిసిన చిరు జల్లులు జనానికి కాస్తంత ఉపశమనం ఇచ్చేలానే ఉన్నాయి.