: మే 19న మధురైలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా: పోలింగ్‌కు ముందే ప్రకటించేసిన విజయకాంత్
తమిళనాడులో ఇంకా పోలింగ్ జరగనేలేదు.. ప్రజలు తమ నిర్ణయాన్ని చెప్పనేలేదు.. కానీ, డీఎండీకే నాయకుడు విజయకాంత్ అప్పుడే తాను మధురైలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని ప్రకటించేశారు. ఈరోజు జరిగిన ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చేనెల 19వ తేదీన తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుందని చెప్పేశారు. తమ కూటమే ఎన్నికల్లో ఘనవిజయం సాధించనుందని అన్నారు. తాను ఏర్పాటు చేసిన కూటమిలోని కార్యకర్తలందరూ తనను ఇప్పటికే కాబోయే ముఖ్యమంత్రిగా పిలుస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.