: వైసీపీ సరుకంతా అమ్ముడుబోయేదే!... ‘జోన్’ తీసుకురాకుంటే హరిబాబు రాజీనామా చేయాలి!: సీపీఐ రామకృష్ణ
ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికార టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’పై నిప్పులు చెరిగిన రామకృష్ణ... వైసీపీ టికెట్లపై విజయం సాధించి టీడీపీలో చేరుతున్న నేతలపై ధ్వజమెత్తారు. వైసీపీలో ఉన్నదంతా అమ్ముడుబోయే సరుకేనని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను ఏర్పాటు చేయాలన్న కేంద్రం హామీ అమలు కాని వైనంపై ఆయన నిప్పులు చెరిగారు. రైల్వే జోన్ ను విశాఖకు తీసుకురాని పక్షంలో బీజేపీ సీనియర్ నేత, విశాఖ ఎంపీ హరిబాబు తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.