: దావూద్ ఇబ్ర‌హీం ప‌రిస్థితి విష‌మం... చావుకి దగ్గరగా మాఫియా డాన్!


ముంబై వ‌ర‌స పేలుళ్ల కేసులో నిందితుడు, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ చావుకి ద‌గ్గ‌ర ప‌డ్డాడు. బాంబు దాడులు చేస్తూ ప్ర‌జ‌ల‌ను వ‌ణికించిన‌ దావూద్ ఇబ్రహీం ప‌రిస్థితి విషమంగా ఉంది. ప్రాణాంత‌కమైన వ్యాధి బారిన ప‌డ్డ‌ దావూద్ కాళ్లలోని అధిక కణజాలం ‘డెడ్’ అయిందని ఇప్ప‌టికే చెప్పిన వైద్యులు ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ కరాచీలోని లియాఖత్ నేషనల్ ఆసుపత్రి, కంబైన్డ్ మిలటిరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది. గ్యాంగ్రీన్ కారణంగా కోలుకోలేని స్థితిలో ఉన్న దావూద్‌ను ర‌క్షించ‌డం ఇక క‌ష్ట‌మేన‌ని పాక్ సైనిక ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News