: నేడూ తాత్కాలిక సచివాలయానికి చంద్రబాబు!... వేద పండితుల సూచన మేరకేనట!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు కూడా వెలగపూడి పరిధిలోని తాత్కాలిక సచివాలయానికి వెళ్లనున్నారు. నిన్న తెల్లవారుజామున తాత్కాలిక రాజధానిని లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబు... అక్కడ సిద్ధం చేసిన రెండు గదుల్లోని ఓ గదిలో కూర్చుని రుణమాఫీకి సంబంధించిన ఫైలును పరిశీలించడంతో పాటు దానిపై సంతకం కూడా చేశారు. పూర్తిగా శాస్త్రబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు... వేద పండితుల సూచనలను తు.చ తప్పకుండా పాటించారు. శాస్త్రం ప్రకారం రెండో రోజు కూడా అక్కడికి వెళ్లాలని చంద్రబాబుకు పండితులు సూచించారు. వారి సూచన మేరకు నేడు కూడా వెలగపూడికి వెళ్లనున్న చంద్రబాబు... నిన్న కూర్చున్న గదిలోనే కాసేపు కూర్చుని కొన్ని ఫైళ్లను పరిశీలిస్తారు.