: వైసీపీ ఎమ్మెల్యేలను భయపెట్టిన విమానానికి... పైలట్, కో-పైలట్ ఇద్దరూ మహిళలేనట!


‘సేవ్ డెమోక్రసీ’ ఉద్యమంలో భాగంగా నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ బయలుదేరిన స్పైస్ జెట్ విమానానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విమానానికి పైలట్, కో-పైలట్ గా వ్యవహరించిన ఇద్దరూ మహిళలేనట. నిన్న ఉదయం 8.45 గంటలకు శంషాబాదు విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు ఆ ఇద్దరు మహిళా పైలట్లు క్షణాల్లో గుర్తించారు. వెనువెంటనే విమానాన్ని తిరిగి శంషాబాదు ఎయిర్ పోర్టులోనే ల్యాండ్ చేసేందుకు వారు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని ముందుగా వారు విమానంలోని వైసీపీ నేతలకు తెలిపి, ఆ తర్వాత విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News