: ఢిల్లీలోని ఫిక్కీ భవన్ లో భారీ అగ్నిప్రమాదం... తగలబడిపోతున్న మ్యూజియం
ఢిల్లీలో నేటి తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని ఫిక్కీ భవన్ లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. పై అంతస్తులోని మ్యూజియంలో చిన్నగా మొదలైన మంటలు క్షణాల్లో మొత్తం మ్యూజియానికి విస్తరించాయి. మ్యూజియంలోని విలువైన వస్తువులను మంటలు దహించివేస్తున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగిపోయారు. ఫైరింజిన్లతో వచ్చి మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు సమాచారం.