: సుష్మాకు ఛాతీలో నొప్పి!... ఎయిమ్స్ లో చేరిన కేంద్ర మంత్రి


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో ఆమె తీవ్ర ఇబ్బంది పడ్డారు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో సుష్మాకు నొప్పి నుంచి కాస్తంత ఉపశమనం లభించింది. ఆమెను ఆసుపత్రిలోని ప్రైవేట్ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆ తర్వాత పేర్కొన్న వైద్యులు... పరిస్థితి మరింత మెరుగైన తర్వాత డిశ్చార్జీ చేయనున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News