: ఏ పని చేసినా కొందరు రాజకీయ నేతలు విమర్శిస్తుంటారు: సీఎం కేసీఆర్
ఏ పని చేసినా కొందరు రాజకీయ నేతలు విమర్శలు చేస్తుంటారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ లు టీఆర్ఎస్ లో చేరిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. టీఆర్ఎస్ లో చేరికలు చిల్లర రాజకీయాలు కావని అన్నారు. శాసనసభ సాక్షిగా అన్ని పక్షాలను కలుపుకుని పోయే పని చేస్తున్నామన్నారు. ఖమ్మం చుట్టు పక్కల గ్రామాలకు పాలేరు నుంచి తాగునీటిని సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.