: అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వర్యులు... చేతివాటంలో జేబుదొంగలు!


నల్గొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఓపక్క తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి బిజీగా ఉండగా, మరోపక్క జేబు దొంగలు తమ చేతివాటంతో తామూ బిజీగా ఉన్నారు. హాలియా మండలం తిరుమలగిరి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిర్వహించిన భూమి పూజలో మంత్రి పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. భూమి పూజా కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే జేబు దొంగలు తమ చేతి వాటం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురి నుంచి మొత్తం రూ.18,700 కాజేశారు. జేబు దొంగల చేతి వాటానికి గురైన వారిలో వీఆర్ఏ నర్సింహ కూడా ఉన్నారు. ఆయన జేబులోని రూ.3 వేలను దొంగలు తస్కరించారు.

  • Loading...

More Telugu News