: తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు


తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు జరిగాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. వాటి వివరాలు...మంత్రి కేటీఆర్ కు అదనంగా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్, విదేశీ వ్యవహారాలు; జూపల్లి కృష్ణారావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి; తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పశు సంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమ; పోచారానికి అదనంగా సహకార శాఖ కేటాయించారు. కాగా, సీఎం వద్ద ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు వాణిజ్య పన్నులు, గ్రామీణ నీటిసరఫరా శాఖలు రెండు కొత్తగా చేరాయి.

  • Loading...

More Telugu News