: కాళీమాత వేషధారణలో మాయావతి.. ప్ర‌త్యర్థుల‌ను అంత‌మొందించిన‌ట్లు హోర్డింగులు.. తీవ్ర దుమారం


ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) కార్య‌క‌ర్త‌లు ఏర్పాటు చేసిన‌ పోస్టర్లు తీవ్ర వివాదానికి దారి తీసేలా ఉన్నాయి. హిందువుల ఆదిప‌రాశ‌క్తిగా కొలిచే కాళీమాత వేషధారణలో ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ హోర్డింగుల్లో క‌నిపించారు. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను అంత‌మొందిస్తూ కాళీమాత అవ‌తార‌మెత్తిన‌ట్లు ఉన్న హోర్డింగుల‌పై తీవ్ర దుమారమే చెల‌రేగుతోంది. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తలనరికి పట్టుకున్నట్లు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శరీరంపై నిలబడి ఉన్నట్లు, ఎదురుగా ప్రధాని నరేంద్ర మోదీ మోక‌రిల్లి క్షమాపణలు వేడుకుంటున్న‌ట్లు పోస్ట‌ర్లు వెలిశాయి. దీనిలో మోదీ వెనుక‌బ‌డిన కులాల వారికి రిజర్వేషన్లు రద్దు చేయబోనని చెబుతున్నట్లు ఉన్నాయి. దీనిపై అక్క‌డి బీజేపీ నాయకులు స్పందిస్తూ.. బీఎస్పీ తీవ్ర‌ ప‌రిణామాలెదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News