: పాలేరు ఉపఎన్నిక... సీపీఎంకు మద్దతు ప్రకటించిన సీపీఐ
ఖమ్మం జిల్లా పాలేరులో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో సీపీఎంకు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. మద్దతు విషయమై కాంగ్రెస్ పార్టీ కూడా తమను సంప్రదించిందని చెప్పారు. కాంగ్రెస్ మద్దతు కోరినప్పటికీ వామపక్షాల ఐక్యతే తమకు ముఖ్యమని అన్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టిన టీఆర్ఎస్ కు ఈ ఉపఎన్నికలో పాలేరు ప్రజలు బుద్ధి చెప్పాలని చాడ వెంకట రెడ్డి కోరారు. కేసీఆర్ కు ఎన్నికలపై ఉన్న ధ్యాస ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా, మంత్రిగా కొనసాగుతున్న తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.