: సరి-బేసి నుంచి మాకు మినహాయింపు ఇవ్వండి: ఎంపీల విజ్ఞప్తి


ఢిల్లీలో అమలులో ఉన్న సరి-బేసి సంఖ్య విధానం నుంచి తమకు మినహాయింపు నివ్వాలంటూ ఎంపీలందరూ ఒక్కటై డిమాండు చేస్తున్నారు. ఈరోజు నుంచి పార్లమెంట్ రెండో దఫా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై ఏ ఎంపీ ఏమన్నారంటే... టాక్సీల్లో సమావేశాలకు రావడం కుదరదని, ఈ నిబంధనల నుంచి తమకు మినహాయింపు నివ్వాలని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కోరారు. మరో కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ, ఈ విధానం కారణంగా ఎంపీలు పార్లమెంట్ కు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్నారు. సరి-బేసి విధానం కారణంగా సమావేశాలకు హాజరవ్వాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ అన్నారు. కాగా, ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు గాను సరి-బేసి సంఖ్య విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం రెండో విడత సరి-బేసి విధానం ఈ నెల 15 నుంచి అమలు జరుగుతోంది.

  • Loading...

More Telugu News