: ఉగ్రవాదంపై పోరు.. యెమెన్‌లో 800 మంది అల్‌ఖైదా ఉగ్రవాదుల హతం
ఉగ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యంగా యెమెన్ ప్రభుత్వం జరుపుతున్న దాడులతో అల్‌ఖైదా ఉగ్రమూకలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఏడాది కాలంలో అరబ్ సంయుక్త దళాలతో కలిసి యెమెన్ జరిపిన దాడుల్లో 800మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల అధీనంలో ఉన్న ముకల్లా నగరాన్ని, షెహర్‌లోని మినా అల్-ధాబాలోని ఆయిల్ టెర్మినల్‌ను మిలటరీ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడుల్లో కీలక ఉగ్రవాదనేతలు కూడా మృత్యువాత పడ్డారని సంబంధిత అధికారులు చెప్పారు.