: ఎండ‌లు చాలా తీవ్రంగా ఉన్నాయి.. బ‌య‌టికి రాకండి!: చ‌ంద్ర‌బాబు


‘ఎండ‌లు చాలా తీవ్రంగా ఉన్నాయి, బ‌య‌టికి రావ‌ద్ద‌ని కోరుతున్నా’న‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు. క‌డ‌ప జిల్లా బ‌ల్లిగుట్ట చెరువు గ్రామంలో ఈరోజు నిర్వ‌హించిన నీరు- చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... వేస‌వి దృష్ట్యా ప్ర‌జ‌లు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు. నీరు-చెట్టు కార్యక్రమాలు చేపట్టడం వల్లనే కొంత వరకూ భూగర్భ జలాలు పెరిగాయని ఆయన తెలిపారు. ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని కోరారు. వ‌ర్ష‌పు నీటిని కాపాడుకోవాల‌ని సూచించారు. న‌దుల అనుసంధానం వ‌ల్ల భ‌విష్య‌త్తులో నీటి కొర‌త లేకుండా చేయొచ్చని ఆ దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తుంద‌ని తెలిపారు. రైతులు వేసిన పంట‌లు ఎండిపోకుండా ఉండాలంటే పంట కుంట‌లు త‌వ్వాలని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ ప‌థ‌కాలు కొన‌సాగిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News