: ఎనభై ఐదేళ్ల తర్వాత బెంగళూరులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు


వేసవి ప్రారంభం నుంచే దేశ వ్యాప్తంగా ఎండలు అదిరిపోతున్నాయి. ఎప్పుడూ తక్కువ ఉష్ణోగ్రతలతో చల్లగా ఉండే, 'గార్డెన్ సిటీ' బెంగళూరు నగరంపై కూడా ఈ యేడు ఎండల ప్రభావం బాగానే పడింది. ఎనభై ఐదేళ్ల తర్వాత బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 1931 తర్వాత ఇక్కడ నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. 1931 మే 22న బెంగళూరులో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బ ప్రభావంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.

  • Loading...

More Telugu News