: లేటు వయసులో ప్రత్యక్ష బరిలోకి కరుణ!... తిరువారూర్ నుంచి నామినేషన్ వేసిన వృద్ధనేత!
తమిళనాడులో నామినేషన్లు హోరెత్తుతున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా... తాజాగా కొద్దిసేపటి క్రితం అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిపోయారు. ఈ మేరకు ఆమె తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఇక ఇప్పటికే సుదీర్ఘ కాలం పాటు తమిళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొనసాగడమే కాక పలుమార్లు సీఎం పదవిని చేపట్టిన డీఎంకే అధినేత కరుణానిధి కూడా కొద్దిసేపటి క్రితం తన నామినేషన్ ను దాఖలు చేశారు. 90 ఏళ్లకు పైబడ్డ వయసులో ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిపోయారు. తనకు అచ్చి వచ్చిన తిరువారూర్ నియోజకవర్గం నుంచే కరుణ బరిలోకి దిగుతున్నారు. ఈ దఫా ఎన్నికల్లో తన పార్టీని విజయ తీరాలకు చేర్చి.... దేశంలోనే అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నేతగా రికార్డు నెలకొల్పాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు.