: కన్నయ్యపై దాడుల అంశం తీవ్రమైన సమస్య.. దీనిపై పార్లమెంట్‌లో గళం విప్పుతాం!: సీపీఐ
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ నాయకుడు కన్నయ్య కుమార్‌పై పదేపదే దాడులు జరుగుతోన్న అంశంపై పార్లమెంట్ రెండో దశ సమావేశాల్లో గళం విప్పుతామని సీపీఎం తెలిపింది. కన్నయ్యపై దాడులు జరుగుతోన్న అంశం కేవలం ఒక ప్రాంతానికే చెందింది కాదని, కన్నయ్య ఎక్కడికి వెళ్లినా అతనిపై దాడులు జరుపుతున్నారని సీపీఐ నేత డీ.రాజా పేర్కొన్నారు. ఇటీవల నాగ్‌పూర్‌లో ఓ సభలో పాల్గొన్న కన్నయ్యపై పలువురు చెప్పులు విసిరేయడం, అనంతరం కన్నయ్య కారుపై భజరంగ్‌దళ్ కార్యకర్తలు దాడి చేయడం తెలిసిందే. అంతేకాక, జెట్ ఎయిర్ వేస్ విమానంలో ఓ బీజేపీ కార్యకర్త తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని కన్నయ్య కుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై పాలకపక్షాన్ని నిలదీస్తామని సీపీఐ తెలిపింది.