: ‘కల్యాణలక్ష్మి’ పథకంలో మార్పులు
దళితులకు కల్యాణలక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పేరిట తెలంగాణ ప్రభుత్వం యువతులకు పెళ్లి సమయంలో రూ.51 వేలను అందజేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని కల్యాణలక్ష్మి పేరుతోనే బీసీ, ఈబీసీలకు కూడా వర్తింపజేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. కల్యాణలక్ష్మి పథకం వర్తించాలంటే ఆదాయ పరిమితి విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ ఈరోజు మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలుగా సంవత్సరాదాయం కలిగిన బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింస్తుందని తెలిపింది.