: ఆర్కే నగర్ కే ‘అమ్మ’ ఓటు!... నామినేషన్ దాఖలు చేసిన తమిళ సీఎం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం నామినేషన్ల దాఖలు వేగం పుంజుకుంది. ఇప్పటికే పలు పార్టీల ముఖ్యనేతలు తమ నామినేషన్లు దాఖలు చేయగా... అన్నాడీఎంకే అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం జయలలిత కొద్దిసేపటి క్రితం తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో తనను అఖండ మెజారిటీతో గెలిపించిన ఆర్కే నగర్ నియోజకవర్గానికే ఆమె ఓటేశారు. ఆ నియోజకవర్గం నుంచే అన్నాడీఎంకే అభ్యర్థిగా జయ నామినేషన్ వేశారు.