: ‘మెంటల్ పోలీస్’కు హైకోర్టు బ్రేక్!... చిత్రం పేరు మార్చాల్సిందేనని ఆర్డర్!
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘మెంటల్ పోలీస్’కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు బ్రేకులు వేసింది. పోలీసుల ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్న ఈ చిత్రం పేరును మార్చాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... సదరు చిత్రం విడుదలపై స్టే విధించింది. తక్షణమే చిత్రం పేరును మార్చాల్సిందేనని చిత్ర నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ‘మెంటల్ పోలీస్’ పేరుతో చిత్రం నిర్మించినందుకు గాను పోలీసు అధికారుల సంఘం ఇప్పటికే ఈ చిత్రం దర్శక, నిర్మాతలతో పాటు హీరో శ్రీకాంత్ కు లీగల్ నోటీసులు జారీ చేసింది.