: లోక్ సభలో తొలి ప్రశ్న కేశినేని నానిదే!


కేశినేని శ్రీనివాస్ (నాని) ట్రావెల్స్ రంగంలోనే కాదండోయ్... రాజకీయ రంగంలోనూ సత్తా చాటుతున్నారు. చాలా కాలం క్రితమే టీడీపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న కేశినేని... గడచిన ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైసీపీ నేత కోనేరు రాజేంద్రప్రసాద్ పై 75 వేల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఎంపీగా తనను గెలిపించిన బెజవాడ వాసుల స్థితిగతులపై దృష్టి సారించిన కేశినేని... పలు కీలక చర్యలు చేపట్టారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన లోక్ సభ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో తొలి ప్రశ్న సంధించి కేశినేని అందరినీ ఆకట్టుకున్నారు. వంట గ్యాస్ (ఎల్పీజీ) సరఫరాకు సంబంధించి మోదీ సర్కారు ఇటీవల చేసిన పలు మార్పులపై కేశినేని స్పష్టమైన ప్రశ్నను వేశారు. దీనిపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం చెప్పేందుకు కాస్తంత ఇబ్బంది పడ్డారు. ఇక నాని వేసిన ప్రశ్నపై సభలోని ఇతర పార్టీల సభ్యులు కూడా అనుబంధ ప్రశ్నలు సంధించారు. తొలిసారి ఎంపీగా సభకు వచ్చినా... ప్రశ్న సంధించడంలోనే కాక, సమాధానాన్ని రాబట్టడంలోనూ కేశినేని సత్తా చాటారు. ఏమాత్రం తొట్రుపాటు లేకుండా కేశినేని ప్రశ్నను సంధించి సభ దృష్టిని ఆకట్టుకున్నారు. సీనియర్ సభ్యులు కూడా తత్తరపడుతున్న ప్రస్తుత తరుణంలో కేశినేని ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News