: ఓయూ ఉమెన్స్ హాస్టల్ మెస్‌లో చట్నీలో బల్లి.. అల్పాహారం తిన్నాక బయటపడిన విషయం
హైదరాబాదు, తార్నాకాలోని ఉస్మానియా యూనివర్సిటీ( ఓయూ) ఉమెన్స్ హాస్టల్ మెస్‌లో ఈరోజు ఉదయం అల్పాహారంలో బల్లి కనిపించింది. దాదాపు విద్యార్థినులందరూ అల్పాహారం తిన్నాక.. ఈ విషయం బయటపడింది. మెస్‌లోకి కాస్త లేటుగా చేరుకొని కొంతమంది విద్యార్థినులు అల్పాహారం చేస్తుండగా చట్నీలో బల్లి కనిపించింది. అప్పటికే దాదాపు అధిక శాతం మంది విద్యార్థినులు అల్పాహారం చేసేశారు. విషయం తెలుసుకొన్న విద్యార్థినులు ఆందోళన చెందారు. అయితే, దీని వల్ల వారిలో ఎలాంటి అనారోగ్య పరిస్థితి కనిపించలేదు. ఆహారంలో బల్లి కనిపించడంపై సంబంధిత అధికారుల పట్ల విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు.