: చైనా ఒత్తిడితో లొంగిపోయిన మోదీ సర్కారు... దోల్కున్ ఇసాకు వీసా రద్దు!


చైనా నుంచి వచ్చిన ఒత్తిడితో నరేంద్ర మోదీ సర్కారు లొంగిపోయింది. చైనాలో టెర్రరిస్టుగా ముద్రపడిన వరల్డ్ ఉఘుర్ కాంగ్రెస్ నేత దోల్కున్ ఇసాకు జారీ చేసిన వీసాను రద్దు చేస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. దోల్కున్ ధర్మశాలకు వచ్చి దలైలామాను కలవాలని భావిస్తూ, వీసాకు దరఖాస్తు చేసుకున్న వేళ, గతవారంలో భారత్ వీసా మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా భగ్గుమంది. తమ దేశంలో ఉగ్రవాదికి ఇండియా వీసా ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. చైనా నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం ఇసాకు ఇచ్చిన వీసాను వెనక్కు తీసుకుంటున్నట్టు చెప్పి, ఈ మేరకు అతనికి ఈ-మెయిల్ పంపింది. "నేను నిజంగా భారత్ ను సందర్శించాలని అనుకున్నా. అయితే, ఏప్రిల్ 6న నాకిచ్చిన వీసాను క్యాన్సిల్ చేస్తున్నట్టు ఈ-మెయిల్ వచ్చింది. కారణాలు మాత్రం చెప్పలేదు. ఇది దురదృష్టకరం" అని ప్రస్తుతం బెర్లిన్ లో తలదాచుకుంటున్న ఇసా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News