: వైసీపీని వీడుతున్నా!...28న టీడీపీలో చేరుతున్నా: అరకు ఎమ్మెల్యే
సాగర తీర జిల్లా విశాఖలోనూ వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి. వైసీపీ టికెట్ పై అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సర్వేశ్వరరావు... ఆ పార్టీని వీడుతున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. నేటి ఉదయం అరకులో కార్యకర్తలతో భేటీ అయిన సర్వేశ్వరరావు... కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజమేనని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తల ఒత్తిడి మేరకే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే తాను అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నానని తెలిపారు. ఈ నెల 28న టీడీపీలో చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు.