: జీహెచ్‌ఎంసీ వెబ్‌ సైట్‌ లో సన్నీలియోన్ ఫోటో... తొలగించిన అధికారులు!


గ్రేటర్ హైదరాబాద్ పురపాలక కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారిక వెబ్‌సైట్‌లో బాలీవుడ్ శృంగార తార‌ సన్నీలియోన్ న్యూడ్ ఫోటో కనిపించింది. జీహెచ్ఎంసీ ఓఎస్‌ఆర్టీ ఆప్షన్ పేజీలో సన్నీలియోన్ న్యూడ్ ఫోటోను ఎవరో పోస్ట్ చేశారు. పేజీ ఓపెన్ చేయగానే ఆమె చిత్రం దర్శనమిస్తుండటంతో తలపట్టుకున్న అధికారులు, వెంటనే టెక్నికల్ టీముకు సమాచారం ఇవ్వగా, వారు దాన్ని తొలగించినట్టు తెలుస్తోంది. ఎవరో హ్యాకర్లు ఈ ప‌ని చేసి ఉంటార‌ని అధికారులు భావిస్తున్నారు. కాగా, జీహెచ్ఎంసీ ఓఎస్‌ఆర్టీ ఆప్షన్ పేజీని చెత్త‌ను తీసుకెళ్ల‌డానికి ఉప‌యోగించే జీహెచ్ఎంసీ వాహ‌నాల వివ‌రాలు నమోదు చేసేందుకు ఉపయోగిస్తుంటారు.

  • Loading...

More Telugu News