: ఒబామాకు అంత సెక్యూరిటీ అక్కర్లేదన్న బ్రిటన్ రాణి!
బరాక్ ఒబామా... ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి కావచ్చు. కానీ, ఆయన బ్రిటన్ పర్యటన వేళ సీక్రెట్ సర్వీస్ కు చెందిన చాపర్లు మూడింటికి మాత్రమే తమ గడ్డపై ల్యాండింగ్ కు అనుమతిస్తామని బ్రిటన్ రాణి ఎలిజబెత్ స్పష్టం చేశారు. ఆమె నివాసానికి ఒబామా హెలికాప్టర్ లో రానుండగా, 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆ ప్రాంగణంలోకి మూడు హెలికాప్టర్లను మాత్రమే అనుమతించాలని ఆమె నిర్ణయించినట్టు 'డైలీ ఎక్స్ ప్రెస్' వెల్లడించింది. ఈ విషయాన్ని రాజకుటుంబ వర్గాలు వెల్లడించినట్టు తెలిపింది. వాస్తవానికి ఒబామాకు సెక్యూరిటీగా ఆరు చాపర్లు ఉంటాయి. వాటన్నింటినీ రాజ భవంతి విండ్ సార్ క్యాజిల్ లోకి అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. కాగా, 2011లో ఒబామా బ్రిటన్ పర్యటించిన వేళ, ఆరు హెలికాప్టర్లు ల్యాండ్ కాగా, ఆ భవంతిలోని పూల మొక్కలు, గడ్డి నాశనమైనాయని రాణి ఆగ్రహం వ్యక్తం చేశారట. అందువల్లే ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.