: తణుకులో సెల్ టవరెక్కిన యువతి!... పోలీసులు వేధింపులే కారణమని ఆరోపణ


పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. పట్టణానికి చెందిన ఓ యువతి సెల్ టవర్ ఎక్కింది. కిందకు దూకేస్తానంటూ ఆ యువతి చేస్తున్న హెచ్చరికలతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విచారణ పేరిట తనను పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్న పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని సదరు మహిళ ఆరోపించింది. పోలీసులు వేధింపులు ఆపకపోతే...తాను కిందకు దూకేస్తానని ఆమె చెబుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ యువతిని కిందకు దించేందుకు చర్యలు ప్రారంభించారు. నేరుగా జడ్జీ వద్దకు తీసుకెళతామని, సమస్యను న్యాయమూర్తికి చెప్పుకోవచ్చని ఆమెను బుజ్జగించేందుకు యత్నిస్తున్నారు. అయినా వినని ఆ యువతి... తనకు స్పష్టమైన హామీ కావాలని పట్టుబడుతోంది.

  • Loading...

More Telugu News